Monday, October 12, 2009

"ఏది మంచి? ఏది చెడు?"

ఈరోజు నా స్నేహితుడొకడు తన సందేహం వెలిబుచ్చాడు!-
"ఏది మంచి? ఏది చెడు?" అని....
"మంచి,చెడు అనేవి ఏమీ వేరువేరుగా నిర్వచించలేము!" నా సమాధానం.
"అంటే?" వాడి ప్రశ్న!
"సంధర్భాన్ని బట్టి మంచి చెడు గాను, చెడు మంచి గాను కనబడుతుంది."
"అంటే?" మళ్ళీ ప్రశ్న!
" నీకు అర్ధమయ్యేలా చెపుతాను. ఓ పాము ఓ కప్పను మింగుతూ నీకు కనబడింది అనుకో.
 నువ్వు పామును కొట్టి కప్పను రక్షించావనుకో - అప్పుడు నువ్వు కప్ప దృష్టిలో మంచివాడివి, పాము దృష్టిలో చెడ్డవాడివి! అలా కాకుండా వాటినలా వదిలేసావనుకో! అప్పుడు వైస్ వెర్సా అన్నమాట!"
"అబ్బ! నీతో కష్టం రా. ఈరోజు  ఇంకో ప్రోబ్లం !"
" రేపు చెప్పరా! ఇప్పుడు నేను ఆఫీసులో బిసీ." నా విసుగు.
నావైపు కొరకొరా చూస్తూ మావాడి నిష్క్రమణ!        

1 comment:

Anonymous said...

నా వరకు....నువ్వు చేసే పని...ఎవరికైనా కష్టం కలిగిస్తుంటే(directly or indirectly)..ఆ పని చెయ్యకు...