Wednesday, October 28, 2009

మా విశాఖ గొప్పే కదా!

100 శాతం సి. ఎఫ్. ఎల్. బల్బుల పంపకం ద్వారా క్యోటో ప్రోటోకాల్  నుండి  విశాఖ జిల్లా కార్బన్ క్రెడిట్ సాధించి దేశం లోనే ప్రధమ స్థానం సంపాదించింది! సుమారు 5.6 లక్షల ఫిలమెంట్ బల్బులను నాశనం చేసి 7 లక్షల  సి. ఎఫ్. ఎల్. బల్బుల పంపకం ఈపిడి సిఎల్ ద్వారా ఓస్రాం కంపెనీ చేసింది! రెండవ స్థాఅనం లో  హర్యానాలోని యమునా నగర్ ఎంపికైంది! మా విశాఖ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పాదనను తగ్గించడంలో ఈ విధంగా ప్రధమ స్థానం సంపాదించడం గొప్పే కదా!       

Monday, October 26, 2009

మోనాలిసా చిరునవ్వు వెనకాల ఓ రహస్యం!



మోనాలిసా అందరికీ తెలుసు. ఐతే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట!
అదేమిటంటే ఓ సారి చూసినప్పుడు అమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగాను కనిపిస్తుందిట!  దీనిమీద ప్రపంచం లో చాలా రీసెర్చ్ లు జరిగాయిట!  ఐతే ఈమద్యే 'లూయిస్ మార్టినెజ్ ఒటేరొ' అనే న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారుట! - మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటీనాలోని ఏ సెల్స్ పికప్ చేసుకొని ఏ ఛానల్ ద్వారా మెదడుకి ఇమేజ్ ను పంపిస్తుందన్న దానిపై చిత్రం లోని చిరునవ్వు లేక సీరియస్సా అన్నది ఆధారపడుతుందట! అంటే ఒక్క మోనలిసా అనే కాదు, ఎవ్వర్ని చూసినా అది మన ఫీడింగ్ ఛానల్ మీద ఆధారపడుతుందన్నమాట ! చూసే చూపు బాగుంటే  చిరునవ్వు, లేకపోతే ..................!
గతవారం నాకు బెంగుళూరులో  'బెంగుళూరు మిర్రర్ ' అనే పత్రికలో ఈవార్త నా కంటబడింది !  

Monday, October 19, 2009

ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ?

ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ? అనిపించేటటువంటి విషయం ఇది !
మనం సొసైటీలో అనేకమందిని, అనేక విచిత్ర మనస్ తత్వాలు ఉన్నవారిని    చూస్తూ వుంటాం ! నా సబార్డినేట్ ఫ్రెండు ఒకాయన గూర్చి .... 
ఆయన చాలా జాగ్రత్త పరుడనుకొన్నాను ! - ఏ వ్యసనాలు లేవు.  
తరువాత చాలా పెద్ద పిసినారి అని తెలుసుకొన్నాను ! - డబ్బు సంపాదన తప్ప మరో ధ్యస లేదనిపించేలా ఉండే ఆయన ప్రవర్తనను బట్టి !
ఆయనకు ఇద్దరుకొడుకులు. ఇద్దరూ స్థిరపడ్డారు- భార్యా పిల్లలతో !
అటువంటి ఈయనకు ఓ సమస్య ఒచ్చింది ! పాపం ఆయన భార్యకు లివర్ కేన్సర్ ! - అదీ ఫైనల్ స్టేజ్ లో !
వెంటనే హాస్పిటల్ కు వెళ్దామనుకున్నా వీల్లేకపోయింది. ఓరెండ్రోజుల తర్వాత   ఆయన కలిస్తే అడిగాను- ఏంటి ఇలా జరిగింది? నే విన్నది నిజమేనా?
' నిజమే సార్! ఇంక ఈపరిస్తితుల్లో ఆవిడకు ఈవిషయం తెలియడం వల్ల ప్రయోజనం లేదు కదా1- అందుకే చెప్పదలచుకోలేదు.' అన్నారు. 
"మీరు కరెక్టే! ఈ చివరి క్షణాలలో ఆమెకు తెలిస్తే ఇంకొంచెం ప్రమాదం!  ప్రస్తుతం ఆమెకు మీరు, మీకు ఆమె కాబట్టి ఆమెతోనే ఎక్కువ కాలం గడపండి. దీనివల్ల ఆవిడ ఇంకొంచెం ఎక్కువ రోజులు బ్రతకొచ్చు !" అన్నాను.
" ఏం గడపడం సార్! మన అప్పన్న లేడూ? మొన్నామద్య రిటైర్ అయ్యాడు!  అతను   నాకు సుమారు ఓ 70 వేలు బాకీ పడ్డాడు సార్ ! ఇప్పుడేమో తీర్చ లేను అంటున్నాడు.  అందుకనే డిసైడ్ అయిపోయా !  అతనికున్న ఒక ఎకరం పొలం నాపేర రాసేయమంటున్నాను!  ఆ పని మీదే రెండ్రోజులుగా తిరుగుతున్నాను.  మా ఆవిడ వద్ద వాళ్ళ చెల్లెలు ఉంది లెండి!"  
నాకు మాత్రం చాలా కోపం వచ్చింది ! " ఇటు వినండి. మీతో కష్టం, సుఖం పంచుకొని మీ కుటుంబంలో మీకంటే ఎక్కువ భాధ్యతలు మోసి , మీపిల్లలను మీరు పట్టించుకోక పోయినా తీర్చిదిద్ది, మీజీవితంలో సగమైన మీ అర్ధాంగి చివరి అంకం లో ఉంటే మీ ఆలోచనలు ఇలాగ ఉన్నాయ్!  మరో సారి చెప్తున్న. ఆవిడ ఈ చివరి క్షణాలలో మీరు పూర్తికాలం  ఆవిడతో గడపండి. మీకు సెలవులు చాలకపోతే నేను పర్మిషన్ ఇస్తాను! మీక్నంటే వయస్సులో ఎంతో చిన్నవాడినైనా చెప్తున్నాను. వెళ్ళండి." అన్నాను.
ఆయన వెళ్ళిపోయారు.  
 మర్నాడే మళ్ళీ వచ్చి " సార్! ఈవారం  ఓవర్ టైం చేయిస్తున్నారుట కదా! నేను కూడా చేస్తాను.  అనవసరంగా డబ్బులు వదులుకోవడం దేనికి ? "  అన్నాడు.
నాకు మతి పోయింది! ఇతనికి సిటీలో మూడు బిల్డింగులు ఉన్నాయ్! స్థలాలు ఎన్నో! డబ్బులవసరం అంటున్నాడు! భార్య పరిస్తితి ఇలా ఉంది! ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. 
 ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ?  
  ఇటువంటి వారు ఇక మారరా ?
( ఆయన పర్మిషన్ లేకుండా ఇదంతా రాయడం సంస్కారం కాదని తెలుసు. కొందరైనా ఇటువంటివి వారు మారాలని,  డబ్బు సంపాదన వ్యసనం కాకూడదని, అది మితిమీరితే మానవతా విలువలు నశిస్తాయని, జీవితం అంతకంటే విలువైంది అని తెలుసుకుంటే చాలు!"   

Saturday, October 17, 2009

ఈరోజు దీపావళి!-ఏ నరకాసుర వధ జరిగిందని?

ఈరోజు దీపావళి! మిత్రులందరికీ శుభాకాంక్షలు ! 
నేను సామాన్యుడినే కనుక దీపాలు పెట్టడం, టపాసులు కాల్చుకోడం, ఆనందించడం -ఇవన్నీ నేనూ చేస్తాను!
పూర్వం ఎప్పుడో నరకాసురుణ్ణి శ్రీమతి సత్యభామ వధించారు!
అందుకని అప్పుడు ఆనందోస్త్సాహాలతో దీపావళి జరుపుకున్నారు! 
మరి ఇప్పుడూ జరుపుకుంటున్నాం- ఏ నరకాసుర వధ జరిగిందని?
మన మధ్య ఎందరో నరకాసురులు ఇప్పుడూ ఉన్నారు- ఎటొచ్చీ సత్యభామలే కరువయ్యారు !
సత్యభామల సంఖ్య పెరగాలని ఆశిస్తూ.. ( అసలు సత్యభామల అవసరం రాకుండా ఉండాలని కోరుకుంటూ )     

Monday, October 12, 2009

"ఏది మంచి? ఏది చెడు?"

ఈరోజు నా స్నేహితుడొకడు తన సందేహం వెలిబుచ్చాడు!-
"ఏది మంచి? ఏది చెడు?" అని....
"మంచి,చెడు అనేవి ఏమీ వేరువేరుగా నిర్వచించలేము!" నా సమాధానం.
"అంటే?" వాడి ప్రశ్న!
"సంధర్భాన్ని బట్టి మంచి చెడు గాను, చెడు మంచి గాను కనబడుతుంది."
"అంటే?" మళ్ళీ ప్రశ్న!
" నీకు అర్ధమయ్యేలా చెపుతాను. ఓ పాము ఓ కప్పను మింగుతూ నీకు కనబడింది అనుకో.
 నువ్వు పామును కొట్టి కప్పను రక్షించావనుకో - అప్పుడు నువ్వు కప్ప దృష్టిలో మంచివాడివి, పాము దృష్టిలో చెడ్డవాడివి! అలా కాకుండా వాటినలా వదిలేసావనుకో! అప్పుడు వైస్ వెర్సా అన్నమాట!"
"అబ్బ! నీతో కష్టం రా. ఈరోజు  ఇంకో ప్రోబ్లం !"
" రేపు చెప్పరా! ఇప్పుడు నేను ఆఫీసులో బిసీ." నా విసుగు.
నావైపు కొరకొరా చూస్తూ మావాడి నిష్క్రమణ!        

Saturday, October 10, 2009

నోబెల్ శాంతి (?)

ఎవరేమనుకున్నా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి!
కృష్ణమ్మకు వరదలొచ్చాయ్!-తప్పెవరిదైనా నష్టం, కష్టం పాపం ప్రజలదే!
ముఖ్యమంత్రి కుర్చీ ఆటకు తాత్కాలిక బ్రేక్! రోశయ్య బలపడేందుకు అవకాశం!
ఒబామాకు నోబెల్ శాంతి (?) బహుమానం! అందరికీ ఆశ్చర్యం! ( పాపం ఒబామాక్కుడా! ) 
చందమామకు "నాసా" గాయాలు!- నీటి అన్వేషణ నిమిత్తం!  ఫలిస్తే నేను కూడా అక్కడ ఓ ప్లాటు కొనుక్కుంటా!
పొల్ల్యూషన్ తరువాతి స్థావరం చంద్రునిపైనే అనుకుంటా!    

Saturday, October 3, 2009

అధిగమించలేమా? ఇక ఇంతేనా?

ఋతుపవనాల షెడ్యూలు మారిపోతోందా?
జూన్లో పలకరించాల్సినవి సెప్టెంబరు నెలాఖరుక్కాని రాలేదు!
వెళుతూ, వెళుతూ వరదలను కూడా తీసుకొచ్చాయ్!
రైతు ముఖంలో ఆనందం లేదు, అసలు వర్షమే తక్కువనుకునే
మహబూబ్ నగర్, కర్నూలు ప్రాంత వాసులు భీకరమైన వరదలు చూస్తున్నారు!
ఎక్కువ వర్షపాతం  రికార్డయ్యే 'చిరపుంజీ లాంటి ప్రదేశాల్లో తక్కువగానూ,
రాజస్థాన్, గుజరాత్, మన రాయలసీమ వంటి ప్రాంతాలలో సాధారణం కంటె
హెచ్చు గానూ నమోదు అవుతున్నాయ్!....    కారణం? 
-అడవులను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నాం,
-విపరీతంగా కర్బన వ్యర్ధాలను గాల్లోకి వదుల్తున్నాం,
-పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోతోంది,
-టెక్నాలజీ  అభివృద్ధి పేరుతో రకరకాల గ్రీన్ హౌస్ వాయువులను, రసాయన వ్యర్ధాలను గాల్లోకి వదుల్తున్నాం,
 -ఇంకా ఎన్నో కారణాలు!
 పర్యవసానంగా భూతాపం పెరుగుతోంది!
  హిమానీనదాలు తరిగిపోతున్నాయ్!
   ధృవ ప్రాంతాలలో మంచు కరిగిపోతోంది!
  ఋతుపవనాల గమనం మారుతోంది!
  సముద్ర సగటు ఉష్ట్నోగ్రతలు పెరుగుతున్నాయ్!
  అతివృష్టి లేదా అనావృష్టి! పంటలు దెబ్బతింటున్నాయ్, వరదలు వస్తున్నాయ్! ఓహ్!....
  దీన్ని మనం అధిగమించలేమా? ఇక ఇంతేనా?      

Friday, October 2, 2009

ఈరోజు....... ఆయన మాటలు కొన్ని......

ఈరోజు మహాత్ముని  జన్మదినం!
అందరికీ శుభాకాంక్షలు!

ఆయన మాటలు కొన్ని......

Nature abhors weakness.

I refuse to buy from anybody anything, however nice or beautiful, if it interferes with my growth or injures those whom Nature has made my first care.

All taxation to be healthy must return tenfold to the taxpayer in the form of necessary services.

Temples are meant for sinners where they can wash away their sins.

Terrorism and deception are weapons not of the strong but of the weak.

Truth is the right designation of God.

Thursday, October 1, 2009

కిలో రెండ్రూపాయల బియ్యం!

కిలో రెండ్రూపాయల బియ్యం పధకం 1980ల్లోది కదా!
మరి ఇప్పుడూ ఇదే కొనసాగిస్తున్నారంటే ప్రజలను సోమరులను చెయ్యడంకాక మరోటి కాదు కదా?
రూపాయి విలువ అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా లేదు కదా?
ఖజానా ఆర్ధిక పరిస్థితి బాగా లేదనే వార్తల నేపధ్యంలో ఇలా వ్రాయవలసివచ్చింది.
ప్రజాకర్షక (ఓట్ల ఆకర్షక) పధకాల పర్యవసానం ఇలానే వుంటుంది! కాదంటారా?