ఈ వారంలో నాకు అమితానందాన్నిచ్చింది ఓ వార్త!
శ్రీకాకుళం జిల్లాలో సోంపేట ప్రజల తిరుగుబాటు!
వారి జీవనోపాధి పోతుందనో, బ్రతుకుతెరువు కష్టమనో వారి
పోరాటం కావచ్చు!
పర్యావరణ పరంగా అక్కడ జరగబోయే నష్టాన్ని ఆపడానికి
ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి అందరూ సహకరించాల్సిందే!
వారిని అభినందించాల్సిందే!
సోంపేట ఉద్ధానం ఏరియా నేను చూశాను! ఎంతటి పచ్చదనం!
ఆ చిత్తడి నేలలలోనా థర్మల్ పవర్ స్టేషన్ పెట్టేది!
ఎంత ఘోరం! ఈ వన సంపద అంతా భవిష్యత్తులో బూడిద మయం
అవుతుందనే నిజం ఎవరైనా జీర్ణించుకోగలరా?
విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయ్! ఆ కర్మాగారాలు పెట్టుకోడానికి
ఇటువంటి భూములే కావలసి వచ్చాయా?
ఈమద్యే వార్తల్లో చదివాను-2012 నాటికి అమెరికాలో బొగ్గు ఆధారిత
పవర్ ప్లాంట్లు మూసివేస్తారని!
మనం అంత గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయినా, కనీసం పర్యావరణాన్ని
దృష్టిలో పెట్టుకొని నడచుకొంటే మంచిది!
సంకుచిత, స్వార్దపూరిత రాజకీయాలను ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వాలు
విడనాడి అమాయక, సామాన్య ప్రజల హృదయస్పందన అర్ధం చేసుకుంటాయని ఆశిద్దాం!
No comments:
Post a Comment