"హలో! చాలా రోజులకు దర్శనం!"
"ఏముంది! ఈమధ్య శ్రీవారి దర్శనం చేసుకున్నానులే! సుమారు ఓ ఐదు గంటలఫాటు..."
"ఏమిటి! తిరుమలలో శ్రీవారు దర్శన భాగ్యం ఐదు గంటలఫాటు ప్రసాదించేరంటే ఏం అదృష్టం నీది!.."- నా అసూయ!
"తొందర పడకమ్మా....ఐదు గంటలూ క్యూ లో మగ్గిపోయాం అని చెప్పబోతున్న. ఐనా నేనేమైనా రాజకీయనాయకుడినా లేక
వ్యాపారస్తుడినా లేక ఏ సెలెబ్రిటీనైనా అనుకున్నావా? అంతసేపు దర్శన భాగ్యం కలగడానికి! ఎవరో మధ్యం వ్యాపారి
స్వామిని దర్శించుకొందామని వచ్చేరుట! అందుకని మాలాంటి అభాగ్యులందరూ క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి మగ్గేం."
"ఐతే క్యూలోనే దేముడు కనిపించేడనుకుంటా!"
"లేదురా! తిరుమలను ప్రక్షాళనం చెయ్యాలిరా!నాలాంటి మూఢ భక్తులు చాలా నరకం అనుభవిస్తున్నారు! ఇన్ని కష్టాలు
పడితే లఘు దర్శనం, మహాలఘు దర్శనం అని ప్రక్కకు ఈడ్చేస్తున్నరు!"-మావాడి నిట్టూర్పు!
"బాబూ నీకు మాక్రొ,మైక్రో దర్శనం కాకపోతే ఫుల్ దర్శనం ఇస్తే తరువాత ఇంకొక వీఐపికి ఇబ్బంది కదా?
ముందు అక్కడినుండి రాజకీయ నాయకులను తరిమెయ్యాలి- పార్టీలతొ సంబందం లేకుండా ! అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ
ఉద్యోగి నైనా ముందు అక్కడి విధులనుండి తప్పించగలగాలి!అన్నింటికంటే దేమునిముందు అందరూ సమానులమే అంటూ
అందరికీ ఒకే క్యూలో దర్శనం కల్పించాలి-కొన్ని మతాల ప్రార్ధనా మందిరాలలో పాటిస్తున్నట్లు!"
"ఇవన్నీ జరిగే పనులేనా?"- మావాడి సంశయం!
"లేకపోతే ఇక ఆ ఆ దేముళ్ళే కాపాడుకోవాలి! అంతవరకు అసలు అటువంటి చోట్లకు పోకూడదు!క్షేత్ర మహిమ అంటూ ఏదో
చెప్పి మనం వెళుతూ వుంటాం, కనీసం తగ్గించుకోవాలి. ప్రహ్లాద పద్యం మననం చేసుకోవాలి. అంతే!"
"దేముడిదగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది, ప్రశాంతత లభిస్తుంది కదా అని వెళ్తే...."
"ప్రశాంతతా! అదెక్కడ? వెళ్ళిందగ్గరనుండి అంతా యాతనే కదా? దేమునిపై నీకున్న భక్తి ఏపాటిది? ఇక పుణ్యం
అంటావా- పాపం చేసిన వాడే దీని గురించి ఆలోచించాలి!"
2 comments:
తిరుమలలో ఏడు కొండలు చెక్కిన అమర శిల్పి ఎవరు అతని ఆలోచన ఎలా
ఏడు వేల లక్షల కోట్లను దర్శించిన ఆ రూపం విశిష్టత ఎంతవరకు
ఏడు కొండలలో దాగిన రూపాన్ని శిలగా ఎందుకు మార్చారు
ఏడు కొండలు కదిలే వరకు కలియుగంలో నిలిచిన ఆ రూపం ఎందుకు
Hi
welcome to my blog
gsystime.blopspot.com
Everthing is good for ever knowledge - in this blog
తిరుమల ఏడుకొండలలో దాగిన రూపం నేనైతే నా భావ స్వరూపాన్ని విశ్వం తిలకిస్తే -
ఏడుకొండలు కలసిన మధ్య భాగాన్ని మోహన త్రినేత్ర తేజస్సుతో దివ్య ప్రభావాలతో -
నక్షత్ర ప్రకాశములతో మెరుగు పరచి మహా లోకములు చూడలేనంతగా రూపమిచ్చి -
సృష్టిలోనే దివ్య శక్తులతో కూడిన అత్యంత ఉన్నతమైన ప్రదేశాన నిటారుగా నిలిపి -
ప్రకృతి పొరలలో వేకువజామున సన్నగా జారువాలే హిమబిందువులను శంఖమున సేకరించి -
సన్నని గాలి వీస్తున్న వేళ రూపానికి అంగుళం ఎత్తున శంఖపు నీటితో స్నాన పరచగా -
తేనీయ పంచామృతంతో కొబ్బరి నీటిని చిలకరించగా మేఘమలినములు వదిలి శుభ్రతతో -
ప్రతి పుష్ప సుమగంధ మనోహర సువాసనముల సంగీత స్వర మాధుర్య మంత్రములతో -
కోకిల కుహూ రాగ సమ్మేళనాలతో ఓంకార నాధములతో విచక్షనీయ గమన వినికిడితో -
సువర్ణ వజ్ర వైడూర్య నక్షత్ర ప్రకాశములతో కూడిన ఆభరణములను సునాయసంగా అలంకరించి -
నవ దివ్య గంధాల సాంబ్రాణి వేసి మై మరపించే సుమముగల కర్పూర హారతిని ఇవ్వగా -
పరమాత్మ జ్యోతితో జీవము కలుగునట్లు పరిశుద్ధ పరిపూర్ణ పవిత్ర ప్రజ్ఞాన సత్య భావముల -
సూర్యోదయ తొలికిరణాలు నేత్ర తాకిడితో చక్రదారిగా ఒక స్వప్నక్షణమున ప్రత్యక్షమయ్యెను -
Hi,
Welcome to my blog
gsystime.blogspot.com
You go any where in the universe,
knowledge is must -- read my blog
Post a Comment