Monday, July 19, 2010

కేసీయార్ మౌనం!

 గౌరవనీయులైన కేసీయార్ గారు తెలంగాణాకు నష్టం కలుగచేసే

 'బాబ్లీ' ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడరేం?

 ఈ మౌనం వెనుక ఏముందో?

Sunday, July 18, 2010

ప్రభుత్వంపై సోంపేట ప్రజల తిరుగుబాటు!

 ఈ వారంలో నాకు అమితానందాన్నిచ్చింది ఓ వార్త!

 శ్రీకాకుళం జిల్లాలో సోంపేట ప్రజల తిరుగుబాటు!

 వారి జీవనోపాధి పోతుందనో, బ్రతుకుతెరువు కష్టమనో వారి
 పోరాటం కావచ్చు!

 పర్యావరణ పరంగా అక్కడ జరగబోయే నష్టాన్ని ఆపడానికి
 ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి అందరూ సహకరించాల్సిందే!
 వారిని అభినందించాల్సిందే!

 సోంపేట ఉద్ధానం ఏరియా నేను చూశాను! ఎంతటి పచ్చదనం!
 ఆ చిత్తడి నేలలలోనా థర్మల్ పవర్ స్టేషన్ పెట్టేది!

 ఎంత ఘోరం! ఈ వన సంపద అంతా భవిష్యత్తులో బూడిద మయం
 అవుతుందనే నిజం ఎవరైనా జీర్ణించుకోగలరా?

 విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయ్! ఆ కర్మాగారాలు పెట్టుకోడానికి
 ఇటువంటి భూములే కావలసి వచ్చాయా?

 ఈమద్యే వార్తల్లో చదివాను-2012 నాటికి అమెరికాలో బొగ్గు ఆధారిత
 పవర్ ప్లాంట్లు మూసివేస్తారని!

 మనం అంత గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయినా, కనీసం పర్యావరణాన్ని
 దృష్టిలో పెట్టుకొని నడచుకొంటే మంచిది!

 సంకుచిత, స్వార్దపూరిత రాజకీయాలను ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వాలు
 విడనాడి అమాయక, సామాన్య ప్రజల హృదయస్పందన అర్ధం చేసుకుంటాయని ఆశిద్దాం!    
    

 

Sunday, July 4, 2010

తిరుమలలో శ్రీవారు......

"హలో! చాలా రోజులకు దర్శనం!"
"ఏముంది! ఈమధ్య శ్రీవారి దర్శనం చేసుకున్నానులే! సుమారు ఓ ఐదు గంటలఫాటు..."
"ఏమిటి! తిరుమలలో శ్రీవారు దర్శన భాగ్యం  ఐదు గంటలఫాటు ప్రసాదించేరంటే ఏం అదృష్టం నీది!.."- నా అసూయ!
"తొందర పడకమ్మా....ఐదు గంటలూ క్యూ లో మగ్గిపోయాం అని చెప్పబోతున్న. ఐనా నేనేమైనా రాజకీయనాయకుడినా లేక    
 వ్యాపారస్తుడినా లేక ఏ సెలెబ్రిటీనైనా అనుకున్నావా? అంతసేపు దర్శన భాగ్యం కలగడానికి! ఎవరో మధ్యం వ్యాపారి
స్వామిని దర్శించుకొందామని వచ్చేరుట! అందుకని మాలాంటి అభాగ్యులందరూ క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి మగ్గేం."
"ఐతే క్యూలోనే దేముడు కనిపించేడనుకుంటా!"
"లేదురా! తిరుమలను ప్రక్షాళనం చెయ్యాలిరా!నాలాంటి మూఢ భక్తులు చాలా నరకం అనుభవిస్తున్నారు! ఇన్ని కష్టాలు
పడితే లఘు దర్శనం, మహాలఘు దర్శనం అని ప్రక్కకు ఈడ్చేస్తున్నరు!"-మావాడి నిట్టూర్పు!
"బాబూ నీకు మాక్రొ,మైక్రో దర్శనం కాకపోతే ఫుల్ దర్శనం ఇస్తే తరువాత ఇంకొక వీఐపికి ఇబ్బంది కదా?    
ముందు అక్కడినుండి రాజకీయ నాయకులను తరిమెయ్యాలి- పార్టీలతొ సంబందం లేకుండా ! అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ
ఉద్యోగి నైనా ముందు అక్కడి విధులనుండి తప్పించగలగాలి!అన్నింటికంటే దేమునిముందు అందరూ సమానులమే అంటూ 
అందరికీ ఒకే క్యూలో దర్శనం కల్పించాలి-కొన్ని మతాల ప్రార్ధనా మందిరాలలో పాటిస్తున్నట్లు!"
"ఇవన్నీ జరిగే పనులేనా?"- మావాడి సంశయం!
"లేకపోతే ఇక ఆ ఆ దేముళ్ళే కాపాడుకోవాలి! అంతవరకు అసలు అటువంటి చోట్లకు పోకూడదు!క్షేత్ర మహిమ అంటూ ఏదో 
చెప్పి మనం వెళుతూ వుంటాం, కనీసం తగ్గించుకోవాలి. ప్రహ్లాద పద్యం మననం చేసుకోవాలి. అంతే!"
"దేముడిదగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది, ప్రశాంతత లభిస్తుంది కదా అని వెళ్తే...." 
"ప్రశాంతతా! అదెక్కడ? వెళ్ళిందగ్గరనుండి అంతా యాతనే కదా? దేమునిపై నీకున్న భక్తి ఏపాటిది? ఇక పుణ్యం  
అంటావా- పాపం చేసిన వాడే దీని గురించి ఆలోచించాలి!"