"ఎన్నోసార్లు రమ్మన్నా రాలేదు. మా ఇల్లు చూద్దువుగాని రా" అన్నాడు కొలీగ్.
"ఇప్పుడా?" అన్నాను.
"అవును. ఆఫీసు నుండి నేరుగా మా ఇంటికే వెళ్దాం. ఎవరో అద్దెకు అడుగుతున్నారు. ఇల్లు చూస్కుంటారుట" అన్నడు ఈమధ్యనే కొత్త స్వంత ఇంట్లోంచి మరలా క్వార్టర్ల లోనికి మారిన మా వాడు.
వెళ్ళాం. ఎవరో వచ్చారు. చూశారు. చివర్లో ' మీ ఇంటికి ఆగ్నేయ రోడ్డు శూల ఉంది! అది మంచిది కాదు. అందుకే సంశయం!' అన్నారు.
వెంటనే నేను కల్పించుకొని "అదే రోడ్డు ఈ ప్రక్కవారికి కూడా ఎదురుగానే వుంది కదా!' అన్నాను.
" వారికి అది ఈశాన్యం అయ్యింది. అది చాలా మంచిది." అన్నారు.
'ఇప్పటికేనా అర్ధం అయ్యిందా! మా ఇంట్లో అద్దెకు కూడా ఎవరూ దిగక పోవడానికి కారణం?' అన్నట్లు చూశాడు మా వాడు.
"వాస్తు ప్రభావం యజమానికేనా లేక అందులో అద్దెకు ఉన్నవారికి కూడానా?" ఇది నా సందేహం!
" నీ ఇల్లు మాత్రం అంతా వాస్తు పరంగా కట్టుకున్నావ్!" మా వాడి ఈర్ష్య.
-నిజమే. మా ఇల్లు వాస్తు ప్రకారమే కట్టేరు(ట)! అంతా మా బిల్డరు చూస్కున్నాడు, అడగకపోయినా మా కొలీగ్స్ సలహాలిచ్చారు.
"ఇంతకీ వాస్తు అవసరమా? దాని ప్రభావం ఎంతవరకూ నిజం?"
5 comments:
vaastu avasarame,100% nijam
వాస్తు చాలా అవసరమే. దాని ప్రభావం ఇంటి యజమానికీ, అద్దెకున్న వారికీ ఇద్దరికీ ఉంటుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నప్పుడు మేము క్రిస్టియన్స్ ఇంటిలో అద్దెకి ఉండేవాళ్ళం. వాళ్ళు వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదు. మా ఇల్లు మేడ మీద ఉండేది. కింద షాపులు ఉండేవి. షాపులు కూడా వాస్తు ప్రకారం లేవు. ఆ షాపులలో వైశ్యులు ఎరువులూ, సిమెంట్ వ్యాపారం చేసేవాళ్ళు. వాస్తు లేకుండా వాళ్ళు వ్యాపారాలు ఎలా చెయ్యగలిగారు? గోదావరి జిల్లాలలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయితే వాస్తు ప్రకారం కట్టిన ఇళ్ళు సులభంగా దొరకవు. అక్కడ మేము నాలుగేళ్ళు ఉన్నాం, వాస్తు గురించి ఆలోచించకుండా. వాస్తు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు.
వాస్తు అంటే ఆ స్థల ప్రకృతి ధర్మాలను ప్రాతిపదికగా చెసుకొని నిర్ణయిస్తారు ధృవప్రాంతాలనుండి వచ్చే అయస్కాంత తరంగాలను ఋతుపవనాల గమనాలను వాటి ప్రభావం ఆ స్తలం పై చూపే ప్రభావాన్ని ఆ స్థల వాస్తు గా పరిగణిస్తారు
ఆ గ్నేయం లో అగ్ని అని కిచెన్,
నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం,
ఈశాన్యమ్ నడక అని డోర్లు ... వగైరా
ఇవే వాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కస్టాలు కొని తెచ్చుకోకండి.
నిజానికి చూడవలిసినది,ప్రాధాన్యం ఇవ్వవలిసింది వాస్తుకి కాదు. దాని నాణ్యత, పటిష్టత, సౌకర్యం, సౌందర్యం. వీటికే తొలిప్రాధాన్యం ఇవ్వాలి.
పూర్వం ఎప్పుడో దేశ,కాల పరిస్తుతులను బట్టి రూపొందించిన సూత్రాలు అన్నిటికి పనికి వస్తాయనటం సరికాదు.
ఈ కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తం గా ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్నిసాదరంగా స్వాగతించండి.
Post a Comment