కాంగ్రెస్లో ఓ వర్గం వారు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని, రెండో వర్గం వారు అధిష్టానిదే నిర్ణయం అనీ పోరాడుతున్నారు! పాపం ఇక్కడ ప్రజాభీష్టం అంటూ ఏమీ లేదు! 'ఎంతో అనుభవజ్ఞుడైన రోశయ్యగారు పాలించలేరు, జగనే రాష్ట్రానికి దిక్కు 'అన్నట్లు మొదటి వర్గం వారి భావన! దీన్ని నిశితంగా పరిశీలిస్తే జగన్ వర్గం వారి స్వార్ధం మాత్రమే కనబడుతోంది! ఇంతవరకూ కనీసం జగన్ కూడా
" నేను ముఖ్య మంత్రినేమిటి? నాకున్న అనుభవం ఏపాటిది? సీనియర్ల తరువాతే నేను! తండ్రి పోయిన బాధలో వున్నాన్నేను!" అని ఓ ప్రకటన ఇస్తే ఎంత హుందాగా వుంటుంది?- కాని అతను కూడా ముఖ్య మంత్రినైపోదామని ఎదురు చూస్తున్నట్లుంది! ఏం చేద్దామనో? ఎలా పరిపాలిద్దామనో?
4 comments:
Well Said. I agree with you. It would be very nice if he will make an announcement like that.
>>>> కాని అతను కూడా ముఖ్య మంత్రినైపోదామని ఎదురు చూస్తున్నట్లుంది! <<<
అంతే కాదు కాంగ్రెస్ అధిష్టానం తనను చచ్చినట్టు ముఖ్యమంత్రి గా నియమిస్తుందని ...ఒక వేళ నియమించక పొతే తను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి ఒక్క విజిల్ గానీ వేసానంటే ఎనిమిది కోట్ల తెలుగు గొర్రెలు ఆ పార్టీలో చేరేందుకు క్యూలు కడతారని కూడా నమ్ముతున్నట్టుంది. పావలా వడ్డీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పెన్షన్లు , స్కాలర్షిప్పులు అన్నీ తన త్రండ్రి తమ సొంత ఖజానా నుంచి పెట్టిన బిక్షే అన్న అతి నమ్మకం కూడా వుంది. పావురాల గ్గుట్ట స్పీచ్ లోనే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. సాక్షి పేపర్ , సాక్షి టీవీ మొత్తం ఎనిమిది కోట్ల గొర్రెల మెదళ్ళనినియంత్రిస్తాయన్న భ్రమలో వున్నారు. రాహుల్ గాంధి ఆదర్శం, సోనియా గాందీ త్యాగం ఇప్పుడు తనకి ఏమాత్రం ఎక్కవు..అనుభవిస్తే తప్ప గుణపాఠం నేర్చుకోరు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా వెర్రి వెంగలప్పలు అని భావిస్తున్నారు. పిల్ల కాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ.. దురాశ దుఖానికి చేటు .
దీనికంతటికీ మీడియానే కారణం. ఈ మీడియా ఒకప్పుడు చిరంజీవికి ఇలాంటి భ్రమల్నే కల్పించి ఆయన్ని బోర్లా పడేసింది. ఇప్పుడు జగన్ ని మాయలో పెడుతోంది. ఏతావతా నాయుడుగారి జాతకం బావున్నట్టుంది.
అంతక్రియలు జరుగుతున్నప్పుడు ఎలకషన్ల ప్రచార సలో ఉన్నట్టచేతులెత్తి నమస్కారం పెడుతూ ఉన్నాడు! ఏందో పొందాలనే ఆరాటం తప్పించి ఆరోజు అంత్యక్రియలు చేస్తున్న ప్రవర్తన లేదు!
Post a Comment