నేను చాలా గర్వపడుతున్నాను!
గాంధీ పుట్టినదేశం లో పుట్టినందుకు , నెహ్రూ కలలుగన్న ప్రజాశ్వామ్యంలో జీవిస్తున్నందుకు!
నా ఈ దేశంలో
అవినీతి లేదు! నల్లధనం అసలే లేదు! (ఒకప్పుడు వుండేదట- స్విస్ బ్యాంక్ లో!)
బంధుప్రీతి లేదు! కుల, మత, వర్గ విచక్ష ణ అసలే లేదు! ( ఒకప్పుడు వుండేదట!)
నాయకులు ప్రజలవద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారు! (సమస్యలు వుంటే!)
పంటలు పుష్కలం! ధరలు ఎపుడూ స్థిరంగానే వుంటాయి! (నల్ల బజారు అంటే ఏమిటో తెలీదు!)
ప్రజలు కష్టజీవులు! అక్షరాస్యులు! పిల్లలందరూ బడికెళ్తారు!
తాగునీటికి, పంటలకు నీరు పుష్కలం!
నదుల అనుసంధానం జరగడం వల్ల వరదలు లేవు!
అనారోగ్యాలు లేవు- ఎందుకంటే ' మందు' లేదు కనుక!
నేరాలు లేవు! శిక్షలూ లేవు! (ఏసిడ్ దాడులూ లేవు!కత్తిపోట్లు అసలే లేవు-సినిమాల్లో తప్ప!)
ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతారు!- నేను కూడా!............
.............అబ్బ!వర్షాకాలం లో కూడా ఉక్కపోత! కరెంటు ఎప్పుడు పోయిందో?
అమ్మో!ఆఫీసుకు లేట్ అవుతుందేమో? కళ్ళు నులుపుకుంటూ లేచాను!
తలుపు తీసి గేట్లో పడివున్న పేపరు చూసాను!
రాజమండ్రిలో మరో మానవ మృగం! ప్రేమ పరువు తీసే మరో కిరాతక సంఘటన, వంచన!
అంటే మనకింకా స్వతంత్ర్యం రాలేదన్నమాట!
ఆహా! కల ఎంత తియ్యన! మరి నిజం ఎప్పుడూ చేదేనా?
2 comments:
సినిమాల్లొ మాత్రం కత్తిపోట్లెందుకు?
సినిమాల్లో హింస 'కలలో' కూడా చెరిగిపోనంతగా పెరిగిపోయింది!
అందుకేనేమో సమాజం లో హింసకూ, ప్రేమకూ తేడా తెలియట్లేదు!
చందమామ
Post a Comment