ఈనెల మొదటి వారం లో మన ముఖ్యమంత్రి దుర్మరణం ఒక విచారకరమైన, దిగ్బ్రాంతికరమైన విషయం!
అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే సుమారు ఓ రెండొందలు పైగా అభిమానులు ప్రాణాలు కోల్పోవడం!
ప్రాణాలకు విలువ ఇంతేనా? ఇంత బలహీనమైన గుండెలా మనవి? ఎవరికోసం ఈ ప్రాణత్యాగాలు?పోయినవారి సన్నిహితులు, స్నేహితులు, చివరికి వారి కుటుంబ సభ్యులు అందరూ బాగానే వున్నారే?
చనిపోయి ఏమి సాధిస్తారో? ఎవరిని సాధిస్తారో? ఇటువంటి బలహీనమైన మనసున్నవారికి చికిత్స
అవసరమేమో? దీంట్లో కొంత పాత్ర వార్తా చానళ్లదీను!చూపిందే చూపిస్తూ సినిమా పాటల్తో, విచారకరమైన
సంగీతంతో పోటీపడి ప్రసారాలు చేసారు! దీన్ని అభిమానం అనేకంటే దురభిమానం అంతే సరిపోతుంది!
చనిపోయినవారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం!
ఏమంటారు?
1 comment:
నిజం చెప్పారు
Post a Comment