Thursday, April 22, 2010

Saturday, March 20, 2010

నేస్తమా! బాగున్నావా?

ప్రియమైన నేస్తమా! బాగున్నావా? 
నేనెవరా అని ఆలోచిస్తున్నావా?
అవునులే నాలాంటి అల్పులు నీకెందుకు గుర్తుంటారు!
నీతో నేను...పల్లెలైనా, పట్నాలైనా... నీ తోనే నేను!
మన మధ్య బంధం అటువంటిది! ఐతే ఇది నిన్నటి మాట!
ఈ రోజున నాతో నీకేం పని? నీ busy life లో నేనెంత?
నీ గురించే నీవు ఆలొచించుకునే తీరిక లేక అన్ని రకాల tension లతో బ్రతుకుతూ ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటున్నావు కదా!
ఈ విషయంలో నిజంగా నీపై ఓ మిత్రుడిగా నా ప్రగాఢ సానుభూతి!
ఆ రోజుల్లో..........
నీ తోనే నా జీవితం! నీ ఇంట్లోనే నా నివాసం కూడా!
నువ్వు పండించే పంట గింజల్ని ముందు నాకే రుచి చూపించేవాడివి కదూ!
నీ పంటలపై కీటకాలను తింటూ, నీతోనే, నీ ఇంట్లోనే, నీ వారి మధ్య ఆడుతూ, పాడుతూ ఉండేదాన్ని!
ఉదయాన్నే నా కిచకిచలతో నిన్ను, నీవాళ్లనూ నిద్ర లేపేదాన్ని! నా సందడి లేని ఏ లోగిలి ఐనా ఉండేదా?
నా కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న గూళ్లు కూడా అమర్చేవాడివి!
నీ ఇంటి చూరులో, వెంటిలేటర్లలో, అటకల మీద.....ఓహ్ ఎక్కడైనా adjust అయ్యేదాన్ని!
........కాని
ఊహకందనంతటి వేగంగా నావాళ్లందరూ ఒక్కొక్కరూ నన్ను విడిచిపోయారు(?)
ఎక్కడో, ఎప్పుడో కాని కనబడరు! అదీ నిశ్తేజంగా, నిస్సారంగా....ఒకటీ..అరా!
~ ఏవో సెల్ ఫోను టవర్లట! దానినుండి వచ్చే రేడియేషన్ లాంటిదేదో మేము అంతరించడానికి కారణమట!-ఏమో?
మారుమూల పల్లెటూర్లలోనూ  నావాళ్లు కనపడుటలేదు (ఆ రేడియేషనేదో నీకు హాని చేస్తుందేమో? జర జాగ్రత్త!)
~ ఎరువుల,పురుగులమందుల పంటలట! (ఆ పురుగులను, పంటలను తిని మా వాళ్లు.....?)
~ పట్టణాలు, నగరాలు ఇప్పుడు పూర్తి కాంక్రీటు జంగిల్స్ కదా!
-అందుకనేనా నా వాళ్లు నన్నూ, నిన్నూ కూడా వదిలేశారు?-ఏమో?
~ లేక ఈ అల్ప ప్రాణి మీద నీకు తెలియకుండానే ఏ టెక్నాలజీ బ్రహ్మాస్త్రాన్నైనా ప్రయోగించావా?...... ఏమో?
  ...... ఏది ఏమైనా ఇది ఇలాగే కొనసాగితే నేను ఇక పూర్తిగా కనబడను. కనీసం నా బొమ్మనైనా నీ హాల్లో షోకేసు లో గుర్తుగానైనా పెట్టుకో నేస్తమా!
అంతర్థానమైన అనేక జీవులలాగే నేను కూడా...
నేనేకాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు నీవు కూడా....!!!
     
                                                 జాగ్రత్త మిత్రమా! ఉంటాను.
                   
                      ఎప్పటికీ నీ నేస్తం...   నీ కిచకిచల "పిచ్చుక" (House Sparrow)
 (ఈ రోజు World House Sparrow Day సందర్భంగా......)

Tuesday, March 16, 2010

ఉగాది శుభాకాంక్షలు












బ్లాగ్ మిత్రులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Monday, February 15, 2010

Winner

This theory will win the Physics Nobel Prize in 2010!
Equation 1

Human = eat + sleep + work + enjoy
Donkey = eat + sleep

Therefore,
Human = Donkey + work + enjoy

Therefore,
Human - enjoy = Donkey + work

In other words,
Human that don't know how to enjoy = Donkey that work
============ ========= ========= ========= ========= ===

Equation 2

Men = eat + sleep + earn money
Donkeys = eat + sleep

Therefore,
Men = Donkeys + earn money

Therefore,
Men - earn money = Donkeys

In other words,
Men that don't earn money = Donkeys
============ ========= ========= ========= ========= ====

Equation 3

Women = eat + sleep + spend
Donkeys = eat + sleep

Therefore,
Women = Donkeys + spend

Therefore,
Women - spend = Donkeys

In other words,
Women that don't spend = Donkeys
============ ========= ========= ========= ========= =====

To Conclude:

From Equation 2 and Equation 3
Men that don't earn money = Women that don't spend.

So, Men earn money not to let women become Donkeys! (Postulate 1)

And, Women spend not to let men become Donkeys! (Postulate 2)

So, we have?
Men + Women = Donkeys + earn money + Donkeys + spend money

Therefore from Postulates 1 and 2, we can conclude,
Man + Woman = 2 Donkeys that live happily together!

Sunday, February 7, 2010

వంకాయ సొద!

ఈమధ్య పేపర్లలోను, టి. వి. ఛానళ్ళలోను వంకాయ కబుర్లు కనబడుతున్నాయ్!
Genetically modified Bt వంకాయ గురించి!
దీన్ని ఇండియాలో వుత్పత్తి చేయడం, వాడకానికి సంబందించి
శాస్త్రవేత్తలు, రైతులు, సామాన్యులనుంచి అనేక అభిప్రాయాలు!
-ఇప్పటికే దేశంలో సుమారు 2,400 రకాల వంకాయలు వాడుతూ వుండగా
మరలా ఇదెందుకు అని కొందరు,
-GM Technology ను వ్యతిరేకిస్తున్నవారు Mobile Technology లాంటి వాటిని
మాత్రం ఆహ్వానిస్తున్నారని కొందరు,
-అసలు ఈ Bt వంకాయను ఇండియాలోనే ఎందుకు ముందుగా ప్రవేశపెట్టాలని
ఇంకొందరు.......
ఏది ఏమైనా సరిగ్గా వండాలే కాని వంకాయకూర రుచే వేరు!
 "వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియు" అన్నారు!
మరి " Bt వంకాయ వంటి కూరయు,.............." ఏమంటారో?