Monday, October 19, 2009

ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ?

ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ? అనిపించేటటువంటి విషయం ఇది !
మనం సొసైటీలో అనేకమందిని, అనేక విచిత్ర మనస్ తత్వాలు ఉన్నవారిని    చూస్తూ వుంటాం ! నా సబార్డినేట్ ఫ్రెండు ఒకాయన గూర్చి .... 
ఆయన చాలా జాగ్రత్త పరుడనుకొన్నాను ! - ఏ వ్యసనాలు లేవు.  
తరువాత చాలా పెద్ద పిసినారి అని తెలుసుకొన్నాను ! - డబ్బు సంపాదన తప్ప మరో ధ్యస లేదనిపించేలా ఉండే ఆయన ప్రవర్తనను బట్టి !
ఆయనకు ఇద్దరుకొడుకులు. ఇద్దరూ స్థిరపడ్డారు- భార్యా పిల్లలతో !
అటువంటి ఈయనకు ఓ సమస్య ఒచ్చింది ! పాపం ఆయన భార్యకు లివర్ కేన్సర్ ! - అదీ ఫైనల్ స్టేజ్ లో !
వెంటనే హాస్పిటల్ కు వెళ్దామనుకున్నా వీల్లేకపోయింది. ఓరెండ్రోజుల తర్వాత   ఆయన కలిస్తే అడిగాను- ఏంటి ఇలా జరిగింది? నే విన్నది నిజమేనా?
' నిజమే సార్! ఇంక ఈపరిస్తితుల్లో ఆవిడకు ఈవిషయం తెలియడం వల్ల ప్రయోజనం లేదు కదా1- అందుకే చెప్పదలచుకోలేదు.' అన్నారు. 
"మీరు కరెక్టే! ఈ చివరి క్షణాలలో ఆమెకు తెలిస్తే ఇంకొంచెం ప్రమాదం!  ప్రస్తుతం ఆమెకు మీరు, మీకు ఆమె కాబట్టి ఆమెతోనే ఎక్కువ కాలం గడపండి. దీనివల్ల ఆవిడ ఇంకొంచెం ఎక్కువ రోజులు బ్రతకొచ్చు !" అన్నాను.
" ఏం గడపడం సార్! మన అప్పన్న లేడూ? మొన్నామద్య రిటైర్ అయ్యాడు!  అతను   నాకు సుమారు ఓ 70 వేలు బాకీ పడ్డాడు సార్ ! ఇప్పుడేమో తీర్చ లేను అంటున్నాడు.  అందుకనే డిసైడ్ అయిపోయా !  అతనికున్న ఒక ఎకరం పొలం నాపేర రాసేయమంటున్నాను!  ఆ పని మీదే రెండ్రోజులుగా తిరుగుతున్నాను.  మా ఆవిడ వద్ద వాళ్ళ చెల్లెలు ఉంది లెండి!"  
నాకు మాత్రం చాలా కోపం వచ్చింది ! " ఇటు వినండి. మీతో కష్టం, సుఖం పంచుకొని మీ కుటుంబంలో మీకంటే ఎక్కువ భాధ్యతలు మోసి , మీపిల్లలను మీరు పట్టించుకోక పోయినా తీర్చిదిద్ది, మీజీవితంలో సగమైన మీ అర్ధాంగి చివరి అంకం లో ఉంటే మీ ఆలోచనలు ఇలాగ ఉన్నాయ్!  మరో సారి చెప్తున్న. ఆవిడ ఈ చివరి క్షణాలలో మీరు పూర్తికాలం  ఆవిడతో గడపండి. మీకు సెలవులు చాలకపోతే నేను పర్మిషన్ ఇస్తాను! మీక్నంటే వయస్సులో ఎంతో చిన్నవాడినైనా చెప్తున్నాను. వెళ్ళండి." అన్నాను.
ఆయన వెళ్ళిపోయారు.  
 మర్నాడే మళ్ళీ వచ్చి " సార్! ఈవారం  ఓవర్ టైం చేయిస్తున్నారుట కదా! నేను కూడా చేస్తాను.  అనవసరంగా డబ్బులు వదులుకోవడం దేనికి ? "  అన్నాడు.
నాకు మతి పోయింది! ఇతనికి సిటీలో మూడు బిల్డింగులు ఉన్నాయ్! స్థలాలు ఎన్నో! డబ్బులవసరం అంటున్నాడు! భార్య పరిస్తితి ఇలా ఉంది! ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. 
 ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ?  
  ఇటువంటి వారు ఇక మారరా ?
( ఆయన పర్మిషన్ లేకుండా ఇదంతా రాయడం సంస్కారం కాదని తెలుసు. కొందరైనా ఇటువంటివి వారు మారాలని,  డబ్బు సంపాదన వ్యసనం కాకూడదని, అది మితిమీరితే మానవతా విలువలు నశిస్తాయని, జీవితం అంతకంటే విలువైంది అని తెలుసుకుంటే చాలు!"   

8 comments:

భావన said...

wow no words to comment...

Malakpet Rowdy said...

Same thoughts as Bhavana. He's an interesting person though.

Rajasekharuni Vijay Sharma said...
This comment has been removed by the author.
Rajasekharuni Vijay Sharma said...

అవును బాగా చెప్పారు. జీవితం కంటె విలువైనది ఏదీలేదు.

మీ పరిచయం నచ్చింది. మీ స్నేహితునిగా చేరుతున్నాను మిత్రమా... :)

Anil Dasari said...

ఇలా ఆలోచించి చూడండి .... ఆవిడకి జబ్బు తీవ్రత గురించి చెప్పలేదంటున్నారు కదా. అందుకే ఆయన ఎప్పట్లా డబ్బు సంపాదన యావలోనే ఉన్నట్లు నటిస్తున్నాడేమో - ఉన్నట్లుండి ధోరణి మార్చుకుని ఆమెతో ఎక్కువ సమయం గడపటం మొదలు పెడితే ఆమెకి అనుమానం వస్తుందనుకున్నాడేమో?

Anonymous said...

evariki nachchinattu vaallu untaru, meeru enduku salahaalu ivvadam! mee life meeru sariggaa chusukondi chaalu.

Anonymous said...

అతను తన డబ్బు ను జాగ్రత్త చేసుకొంటున్నాడో, లేక తను కష్టపడి డబ్బు సంపాదించాలనుకొంటున్నాడొ మనలో చాలా మంది ఖర్చు దార్లు లగా కాకుండా అనేది అతని ఇష్టం కదండి. అవతలి వాళ్ల దబ్బులును మోసం చేసి, కబుర్లు చెప్పి లాక్కొనంతవరకు, అది మంచిపద్దతే కాదంటారా?
ఇక తన భార్య ను దగ్గర ఉండి చూసుకొంటే తను ఆనందిస్తుందో, లేక ఆమె చెల్లెలు దగ్గరుండి చూసుకొంటే ఆనందిస్తుందో తనకంటే మనకే తెలుసంటారా?

Anonymous said...

Oh my god, this is too bad.