ఈరోజు దీపావళి! మిత్రులందరికీ శుభాకాంక్షలు !
నేను సామాన్యుడినే కనుక దీపాలు పెట్టడం, టపాసులు కాల్చుకోడం, ఆనందించడం -ఇవన్నీ నేనూ చేస్తాను!
పూర్వం ఎప్పుడో నరకాసురుణ్ణి శ్రీమతి సత్యభామ వధించారు!
అందుకని అప్పుడు ఆనందోస్త్సాహాలతో దీపావళి జరుపుకున్నారు!
మరి ఇప్పుడూ జరుపుకుంటున్నాం- ఏ నరకాసుర వధ జరిగిందని?
మన మధ్య ఎందరో నరకాసురులు ఇప్పుడూ ఉన్నారు- ఎటొచ్చీ సత్యభామలే కరువయ్యారు !
సత్యభామల సంఖ్య పెరగాలని ఆశిస్తూ.. ( అసలు సత్యభామల అవసరం రాకుండా ఉండాలని కోరుకుంటూ )
6 comments:
దీపావళి శుభాకాంక్షలు.మీరు కూడా అందుకోండి.
వున్నామండి అవసరమైతే మాలోని సత్య రూపు వెలికి వస్తుంది అందాక రుక్మిణి, రాధ, మిత్రవింద ఇలా మిగిలిన రూపాల్లో మెసులుతుంటాము.
దీపావళి శుభాకాంక్షలు.
సత్యభామ రానక్కర్లేదండీ మనలోని చెడుపై యుద్ధం చేసి మనమే విజయులమౌదాం !మీకూ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !
సత్యభామ శ్రీకృష్ణుడు కి యుద్ధం మధ్య లో నిద్ర వచ్చింది అని యుద్ధం చేసారు కదా
YSR narakasura died, so we can celebrate..
well said
Post a Comment