Saturday, July 23, 2011

ఏమి మాయ!!!




మనరాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నా, చెందుతోంది అన్నా,
నమ్మకూడదు.

ఎందుకంటే.....

ఎ.పి. లో 98% తెల్ల రేషన్ కార్డు దారులేనుట!
జాతీయ జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న
కుటుంబాల సంఖ్య 2.08 కోట్లు. కాని జారీ అయిన
తెల్ల కార్డులు 2.04 కోట్లు.
మరి అప్పుడు తీసిన ఐరిస్ లు ఏమయ్యాయో?
ఏదీ క్రాస్ చెకింగ్?
ఇప్పుడు ఆధార్ కోసం వేలి ముద్రలు కూడా!
దండగ మారిన ఖర్చులు.
మన రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఎంత కళ్ళు మూసుకొని పని చేస్తున్నాయో
తెలుస్తోంది- శిక్షించేదెవరిని?


నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు!


నేటి వార్తల్లో...

చైనాలో చున్ జియాంగ్ అనే అవినీతి అధికారి
1994-2009 మధ్య కాలంలో సుమారు రూ.5.12 కోట్లు
అక్రమంగా సంపాదించినందుకుగాను అతనికి మరణ దండనతో
పాటు అస్తిమొత్తాన్ని జప్తు చెయ్యాలని అక్కడి కోర్టు ఆదేశించిందిట!

అదే మన దేశంలో ఐతే.....?

Sunday, July 10, 2011

ఇప్పుడంతా అవినీతి గురించే!

అవినీతి...బ్లాక్ మనీ...
ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటలు...
క్రితం వారం లో నాకు ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది.
మన వాళ్ళు విదేశాలలో అక్రమంగా దాచిన
డబ్బంతా రప్పిస్తే మన దేశంలో ఏమేమిచెయ్యొచ్చో
వివరంగా అందులో ఉంది! అది ఫార్వర్డ్ చేసింది ఓ 'చిన్న '
అవినీతిపరుడైన నా స్నేహితుడే!
ఆమాటకొస్తే నేను కూడా పతివ్రతను కానేమో!
అవకాశం రాలేదు కనుక ప్రస్తుతానికి "నీతిపరుణ్ణే!".
కుల మతాల పిచ్చిలాగ లంచగొండితనం, అవినీతి
మన రక్తంలోనే ఉందేమో?
నాకో చిన్న కధ గుర్తుకొస్తోంది...
వెనకటికి ఓ రాజుగారి బావమరిదికి ఆ రాజు 
తన చిన్న భార్య పోరు పడలేక ఓఉద్యోగం 
తన ఆస్థానంలో ఇవ్వాల్సివచ్చింది!
ఎక్కడ నియమించినా అవినీతేనట! అంటే
చివరికి గుర్రాలశాలలో కూడా గడ్డి స్కాం అన్నమాట!
చివరికి గంటలు కొట్టే పని ఆప్పగించేరుట!
మరి రాజుగారికి ఇద్దరు భార్యలు కదా!
రాజుగారేమో పెద్దభార్యతో రాత్రి 1 గంటవరకు,
చిన్న భార్యతో తరువాత నిద్రించేవారుట!
చిన్నబార్య తన తమ్ముడికి లంచమిచ్చి 12కే
1గంట కొట్టేట్టు ఏర్పాటు చేసుకొంది.
ఇదితెలిసిన పెద్దభార్య కూడా లంచమిచ్చి
1గంటకు 12 కొట్టేటట్లుగా ఏర్పాటు చేసుకొంది!
విషయం తెలిసిన ఇద్దరు భార్యలు చివరికి రాజీపడి
సరియైన సమయానికే గంటలు కొట్టమని మన
హీరో గారిని పూరమాయించేరుట--అదీ లంచమిచ్చి!!!

సో.. ఇప్పుడంతా అవినీతి గురించే మాట్లాడుతుంటే
ఓ సగటు భారతీయుడిగా నాకు చాలా గర్వంగా వుంది!
నేను కూడా అన్నాహజారే బాటలో నడుస్తాను!!