ఈమధ్య బెంగళూరు కు చెందిన ఓ కాంట్రాక్టరుతో నా సంభాషణ!
"ఇది ఇలాగే ఎందుకు చెయ్యాలి? ఆ రెండో పద్దతి మంచిది కదా!"-కాంట్రాక్టరు.
" నో. మొదటిదే బెటరు. ఎందుకంటే అది మా బాస్ చెప్పాడు. Boss is always correct !"- నేను.
" మిమ్మల్ని చూస్తుంటే ఓ చిన్న కధ గుర్తుకు వస్తోంది. చెప్పమంటారా!ఏమీ అనుకోరు కదా?"- కాంట్రాక్టరు.
" చెప్పండి."- నేను.
" తండ్రి ఆజ్ఞానుసారం శ్రీరాముడు అరణ్య వాసానికి బయలు దేరు తున్నాడు. అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నారు.రాముడు కోట వెలుపలికి వచ్చేసరికి అయోధ్యలో ప్రజలంతా ‘మేం కూడా మీతోనే’ రాముడుతో అంటూ వెంటపడ్డారు.
అప్పుడు శ్రీరాముడు వారిని వారిస్తూ..' నాతో మీరు రాకూడదు. ఇక్కడే ఉండి మీమీ పనులు, వృత్తులు చేస్కుంటూ మీమీ బాధ్యతలు నిర్వర్తించాలి. లేకపోతే రాజ్యంలో సంక్షోభం ఏర్పడి అరాచకం వస్తుంది. కనుక మీరు నా మాట మీద గౌరవం వుంచి ఇక్కదే వుండండి.' అన్నాడుట.
రాముడు నగరం వెలుపలికి వచ్చి వెనక్కి చూస్తే ఇంకా కొంతమంది ఫాలోవర్లు కనిపిస్తే ఆయన మళ్ళీ అదే డైలాగు రిపీట్ చేసాడుట.
చివరికి నది దాటేముందు ఇంకా వస్తున్న కొందరు ఫాలోవర్స్ తో మళ్ళీ పై డైలాగు రిపీట్ చేసి 'ఈ పడవ మాకు మాత్రమే సరిపోతుంది. దయచేసి అంతా ఇక్కడ డ్రాప్ అవ్వండి.' అని నదిని దాటాక వెనుతిరిగి చూస్తే చాలా కష్టం తో ఈదుకుంటూ,ములిగిపోతూ ఇంకా కొంతమంది రావడం కనిపించిందిట! వారితొ చివరికి శ్రీరాముడు ఇలా అన్నాడుట-' మీకు నాపట్ల ఉన్న విశ్వాసం చూస్తుంటే ఆశ్చర్యం కలుగు తోంది. మీమీ పనులు, భాద్యతల కన్నా కూడా మీకు యజమాని పట్ల విశ్వాసమే ఎక్కువగా వుంది. మీరంతా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భారతావనిలో వెలుగొందుతారు!'
ఈ కధంతా చెప్పి ఆ కంట్రాక్టరు " సారీ సార్! ఏమీ ఫీలవ్వకండి. ఏదో సరదాకి చెప్పాను." అన్నాడు.
"మీ కధ బాగుంది!' అన్నాను...'నేను కూడా ఇంతే కదా' అనుకొంటూ.....