Tuesday, October 4, 2011

మందుకు కూడా కొరత?







 











ఈరోజు టీవీల్లో వో స్క్రోలింగ్ చూసి చాలా
ఆనందించాను!
" రేపటినుండి సకలజనుల సమ్మెలో డిస్టిలరీలు,
మందు డిపోల సిబ్బంది పాల్గొంటారనీ, ఇక మందుకు
కూడా కరెంటు లాగే కొరత రానుందనీ..."
సీమాంద్రులు కూడా దీనికి సపోర్టు చేస్తే
అందరి ఆరోగ్యాలూ బాగు పడతాయ్!

Sunday, October 2, 2011

అలా నవ్వకు బాపూ!

బాపూ....
ఈ రోజు నీ పుట్టినరోజు మేమందరం 'చాలా'
భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నాం!

నీ అమాయకపు బోసినవ్వుతో అలా చూడకు తాతా!
ఆ నీ నవ్వు చూసినప్పుడంతా మామీద మాకే జాలేస్తూ ఉంటుంది!
స్వాతత్య్రం వచ్చి 60 ఏళ్ళు దాటినా, దేశంలో అన్ని వనరులూ ఉన్నా
అవినీతి, బంధు ప్రీతి, అధికార దాహంతో అంతర్గత కుమ్ములాటలు,
కుల, మత, ప్రాంతీయ పోరాటాలతో సతమతవవుతూ,పచ్చని పంట
పొలాలను రియల్ ఎస్టేటు ప్లాటులుగా మార్చేసుకుంటూ, రైతులను కూలీలుగా
మార్చేస్తున్న చేతగాని నాయకులను ఎన్నుకుంటూ,
కేవలం మధ్యం మీద వచ్చే ఆదాయంతోనే మనుగడ సాగిస్తూ......
.............................................................................................

అలా నవ్వకు బాపూ!
చేతనైతే, మామీద అభిమానం ఉంటే, మరలా జన్మించి
మాకు ఎలా బ్రతకాలో నేర్పవూ?

Sunday, August 21, 2011

వ్యతిరేక భావనలు..


ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో రెండు వ్యతిరేక భావనలు..

దేశంలో.. 

ఇన్నాళ్ళకు మనకు ఓ నాయకుడు దొరికాడన్న ఆనందంతో
అన్నా హజారే బాటలో అవినీతికి వ్యతిరేకంగా భారతావని
యావత్తూ కదులుతోంది!.. అందులో మనమూ ఉన్నాం.

ఇక రాష్ట్రంలో.. 

జగన్ అవినీతి వివరాలు బయటకు లాగుతున్నారంటూ
ఆ పార్టీ యంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మరీ
బస్సుయాత్రలు చేయడానికి, మన తెలుగు జనాల్ని మేలుకొలపడానికి(?)
ఉద్యుక్తులవుతున్నారు!

ఈ రెండూ ఎంత వ్యతిరేక భావనలు?

- అసలు జగన్ ఈ ఎంక్వైరీ నుండి దేముని సహాయంతో క్లీన్ చిట్
తీసుకుని నిర్దోషిగా బయటపడి ఏపీ ముఖ్య మంత్రిగా అవతారమెత్తి
ప్రజలకు దేముని పాలన అందించవచ్చు కదా?
గెలిపించే శక్తి, భరించే సహనం తెలుగు వాడికి వుంది.......        

Monday, August 15, 2011

64 ఏళ్ళ స్వాతంత్ర్యం!

బ్లాగ్మిత్రులందరికీ 65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
"స్వాతంత్ర్యం" అసలు మనదేశంలో అందరూ అనుభవిస్తున్నారో, లేదో తెలియదు!
రాజకీయ నాయకులు, కుభేరులైన వ్యపారవేత్తలు మాత్రం అనుభవిస్తున్నారు.
న్యాయ స్థానాల పుణ్యమా అని ఇలాగైనా మనం బ్రతుకుతున్నాం.
మనకు నాయకత్వ లోపమే ఇప్పటికీ వేధిస్తున్న సమస్య.
ఎంత అవినీతి పరుడైనా వాడు నాకులం వాడే కనుక నా వోటు వాడికే!
64 ఏళ్ళ తరువాత కూడా అవసరమైన చట్టాల కోసం సత్యాగ్రహాలు చెయ్యవలసి
వస్తోందంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే తెలియదు!
మనకేం కావాలో మనకే తెలియదేమోననే స్టేజిలో మనం ఉన్నామా?.....        
 

Saturday, July 23, 2011

ఏమి మాయ!!!




మనరాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నా, చెందుతోంది అన్నా,
నమ్మకూడదు.

ఎందుకంటే.....

ఎ.పి. లో 98% తెల్ల రేషన్ కార్డు దారులేనుట!
జాతీయ జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న
కుటుంబాల సంఖ్య 2.08 కోట్లు. కాని జారీ అయిన
తెల్ల కార్డులు 2.04 కోట్లు.
మరి అప్పుడు తీసిన ఐరిస్ లు ఏమయ్యాయో?
ఏదీ క్రాస్ చెకింగ్?
ఇప్పుడు ఆధార్ కోసం వేలి ముద్రలు కూడా!
దండగ మారిన ఖర్చులు.
మన రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఎంత కళ్ళు మూసుకొని పని చేస్తున్నాయో
తెలుస్తోంది- శిక్షించేదెవరిని?


నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు!


నేటి వార్తల్లో...

చైనాలో చున్ జియాంగ్ అనే అవినీతి అధికారి
1994-2009 మధ్య కాలంలో సుమారు రూ.5.12 కోట్లు
అక్రమంగా సంపాదించినందుకుగాను అతనికి మరణ దండనతో
పాటు అస్తిమొత్తాన్ని జప్తు చెయ్యాలని అక్కడి కోర్టు ఆదేశించిందిట!

అదే మన దేశంలో ఐతే.....?

Sunday, July 10, 2011

ఇప్పుడంతా అవినీతి గురించే!

అవినీతి...బ్లాక్ మనీ...
ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటలు...
క్రితం వారం లో నాకు ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది.
మన వాళ్ళు విదేశాలలో అక్రమంగా దాచిన
డబ్బంతా రప్పిస్తే మన దేశంలో ఏమేమిచెయ్యొచ్చో
వివరంగా అందులో ఉంది! అది ఫార్వర్డ్ చేసింది ఓ 'చిన్న '
అవినీతిపరుడైన నా స్నేహితుడే!
ఆమాటకొస్తే నేను కూడా పతివ్రతను కానేమో!
అవకాశం రాలేదు కనుక ప్రస్తుతానికి "నీతిపరుణ్ణే!".
కుల మతాల పిచ్చిలాగ లంచగొండితనం, అవినీతి
మన రక్తంలోనే ఉందేమో?
నాకో చిన్న కధ గుర్తుకొస్తోంది...
వెనకటికి ఓ రాజుగారి బావమరిదికి ఆ రాజు 
తన చిన్న భార్య పోరు పడలేక ఓఉద్యోగం 
తన ఆస్థానంలో ఇవ్వాల్సివచ్చింది!
ఎక్కడ నియమించినా అవినీతేనట! అంటే
చివరికి గుర్రాలశాలలో కూడా గడ్డి స్కాం అన్నమాట!
చివరికి గంటలు కొట్టే పని ఆప్పగించేరుట!
మరి రాజుగారికి ఇద్దరు భార్యలు కదా!
రాజుగారేమో పెద్దభార్యతో రాత్రి 1 గంటవరకు,
చిన్న భార్యతో తరువాత నిద్రించేవారుట!
చిన్నబార్య తన తమ్ముడికి లంచమిచ్చి 12కే
1గంట కొట్టేట్టు ఏర్పాటు చేసుకొంది.
ఇదితెలిసిన పెద్దభార్య కూడా లంచమిచ్చి
1గంటకు 12 కొట్టేటట్లుగా ఏర్పాటు చేసుకొంది!
విషయం తెలిసిన ఇద్దరు భార్యలు చివరికి రాజీపడి
సరియైన సమయానికే గంటలు కొట్టమని మన
హీరో గారిని పూరమాయించేరుట--అదీ లంచమిచ్చి!!!

సో.. ఇప్పుడంతా అవినీతి గురించే మాట్లాడుతుంటే
ఓ సగటు భారతీయుడిగా నాకు చాలా గర్వంగా వుంది!
నేను కూడా అన్నాహజారే బాటలో నడుస్తాను!!
  
  

Saturday, June 18, 2011

పాపం-పుణ్యం

"ఎంత అవినీతికి పాల్పడ్డా, ఎంత సంపాదించినా
నాకు పాపం అంటదు! ఎందుకంటే నేను గుడులు,
గోపురాలు సందర్శించి ఎక్కువ పుణ్యం సంపాదిస్తున్నా!"
 

Saturday, May 21, 2011

మేపడానికి వాంటెడ్ లిస్ట్!


" మొత్తానికి లాడెన్ గారు హతమయ్యారు!"

"....."

"మనప్రభుత్వం కూడా ఓ వాంటెడ్ లిస్ట్ తయారు చేసి పాకిస్తాన్ కు పంపిందిట కదా!"

"ఎందుకోసం? వాళ్ళను కూడా సురక్షితంగా, శుభ్రంగా ఏళ్ళ తరబడి, కోట్లు ఖర్చుపెడుతూ

 అఫ్జల్ గురులాగా, కసబ్ లాగా మేపడానికి!"      

Friday, April 22, 2011

నిద్ర


'నిద్రపోతున్నారా? మీకు హసన్ ఆలీ ఒకరే తప్ప
మిగిలిన బ్లాక్ మనీ గాళ్ళెవరూ కనిపించడం లేదా?'
ఇది ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న!

-నిద్ర పోయేవాడిని లేపొచ్చు కాని నిద్ర నటించే వారిని
 లేపగలమా?

EARTH DAY



నాలో పెరుగుతున్న ఉష్టోగ్రతను పరిశీలించారా?

నా జ్వరాన్ని తగ్గించే మందులేమైనా కనిపెట్టండి! Please....

Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు!

బ్లాగ్మిత్రులందరికీ శ్రీఖరనామ ఉగాది శుభాకాంక్షలు! 

Sunday, April 3, 2011

విశ్వాసం


ఈమధ్య బెంగళూరు కు చెందిన ఓ కాంట్రాక్టరుతో నా సంభాషణ!
"ఇది ఇలాగే ఎందుకు చెయ్యాలి? ఆ రెండో పద్దతి మంచిది కదా!"-కాంట్రాక్టరు.
" నో. మొదటిదే బెటరు. ఎందుకంటే అది మా బాస్ చెప్పాడు. Boss is always correct !"- నేను.
" మిమ్మల్ని చూస్తుంటే ఓ చిన్న కధ గుర్తుకు వస్తోంది. చెప్పమంటారా!ఏమీ అనుకోరు కదా?"- కాంట్రాక్టరు.
" చెప్పండి."- నేను.
" తండ్రి ఆజ్ఞానుసారం శ్రీరాముడు అరణ్య వాసానికి బయలు దేరు తున్నాడు.  అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నారు.రాముడు కోట వెలుపలికి వచ్చేసరికి అయోధ్యలో ప్రజలంతా మేం కూడా మీతోనే  రాముడుతో అంటూ వెంటపడ్డారు.
అప్పుడు శ్రీరాముడు వారిని వారిస్తూ..' నాతో మీరు రాకూడదు. ఇక్కడే ఉండి మీమీ పనులు, వృత్తులు చేస్కుంటూ మీమీ బాధ్యతలు నిర్వర్తించాలి. లేకపోతే రాజ్యంలో సంక్షోభం ఏర్పడి అరాచకం వస్తుంది.  కనుక మీరు నా మాట మీద గౌరవం వుంచి ఇక్కదే వుండండి.' అన్నాడుట.
రాముడు నగరం వెలుపలికి వచ్చి వెనక్కి చూస్తే ఇంకా కొంతమంది ఫాలోవర్లు కనిపిస్తే ఆయన మళ్ళీ అదే డైలాగు రిపీట్ చేసాడుట.  
చివరికి నది దాటేముందు ఇంకా వస్తున్న కొందరు ఫాలోవర్స్ తో మళ్ళీ పై డైలాగు రిపీట్ చేసి 'ఈ పడవ మాకు మాత్రమే సరిపోతుంది.  దయచేసి అంతా ఇక్కడ డ్రాప్ అవ్వండి.'  అని నదిని దాటాక వెనుతిరిగి చూస్తే చాలా కష్టం తో ఈదుకుంటూ,ములిగిపోతూ ఇంకా కొంతమంది రావడం కనిపించిందిట! వారితొ చివరికి శ్రీరాముడు ఇలా అన్నాడుట-' మీకు నాపట్ల ఉన్న విశ్వాసం చూస్తుంటే ఆశ్చర్యం కలుగు తోంది.  మీమీ పనులు, భాద్యతల కన్నా కూడా మీకు యజమాని పట్ల విశ్వాసమే ఎక్కువగా వుంది. మీరంతా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భారతావనిలో వెలుగొందుతారు!'
ఈ కధంతా చెప్పి ఆ కంట్రాక్టరు " సారీ సార్! ఏమీ ఫీలవ్వకండి. ఏదో సరదాకి చెప్పాను." అన్నాడు. 
"మీ కధ బాగుంది!' అన్నాను...'నేను కూడా ఇంతే కదా' అనుకొంటూ.....  

Sunday, March 20, 2011

నన్ను కూడా బ్రతకనిస్తారా!




హలో!దయచేసి నన్ను కూడా మీతో కలసి బ్రతకనిస్తారా!
పాపం మీ పరిస్థితే బాగోలేదు.....నా గురించి ఏం ఆలోచిస్తారులెండి!

Thursday, March 17, 2011

సునామీ

పాపం జపాన్!

ప్రకృతి కన్నెర్ర చేస్తే మనం ఏం చేయగలం!

అక్కడి దృశ్యాలు హృదయాన్ని కలచివేసాయి.

ఎంత నష్టం! ఎంత కష్టం!

మన దేశంలో అవినీతి రాజకీయులను తుడిచేసే

ఓ పెను సునామీ వస్తే ఎంత బాగుంటుంది!  

Saturday, January 1, 2011

శుభాకాంక్షలు!



బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!