'విజయీభవ!'
బ్లాగ్మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
Sunday, October 17, 2010
Saturday, October 2, 2010
ఓ మహాత్మా!
ఓ మహాత్మా! ఈ రోజు నీ జన్మదినం!
మా నాయకులు ఈ రోజు సెలవు ఇచ్చారు కనుక
నిన్ను మరిచిపోకుండా స్మరించుకుంటున్నాం!-లేకపోతే మేం చాలా బిజీ!
నువ్వు చెప్పిన అహింసకు మేము చాలా దూరం!
నువ్వు ఏ పదవీ ఆశించలేదు - కాని
మాకా పదవి లేకపోతే పదితరాలకు సరిపడా ప్రజల సొమ్మును ఎలా దోపిడీ చేయగలం!
అవినీతికి నువ్వు దూరమేమో కాని, అది మా జన్మ హక్కు!
కుల మతాలకు నువ్వు అతీతుడవు కాని,
మాకు కులాలే ప్రాణం! వాటితోనే మా రాజకీయం!
నీకు ఎక్కడెక్కడో ఓ విగ్రహం పెట్టాం!
కాని మా అవినీతి నాయకుల విగ్రహాలను మాత్రం వూరూరా, వాడవాడలా పెట్టుకుంటున్నాం!
మా నోటిముందరి పంచభక్ష్య పరమాన్నాలను దోచుకున్నా ఏమీ అనం!
బదులుగా ఓ కేజీ బియ్యం 'ఫ్రీ' గా ఇస్తే ఎంతో సంతోషిస్తాం!
నువ్వేమో మధ్యపాన నిషేదం అన్నావు!
మాకేమో దానిమీద ఆదాయమే ముఖ్యం!
నువ్వు దేశం కోసం కుటుంబాన్ని వదులుకున్నావు!
మా నాయకులు కుటుంబం కోసం దేశాన్నే అమ్మేస్తున్నారు!
ఇన్ని చేస్తున్నా మా నాయకులు వీరే! వీరికే ఓటేస్తాం!
మమ్మల్ని మన్నించు మహాత్మా!
Subscribe to:
Posts (Atom)