Monday, August 31, 2009

నేటి సంగతి:


దైవ దర్శనం కోసం మన వీఐపిలు, వీవీఐపిలు వస్తే దేముడు పుణ్యం ఇస్తాడా? లేక అప్పటివరకు క్యూలో నున్న ముసలివారిని,పిల్లలను,స్త్రీలను, ఇతర భక్తులను ఇబ్బంది పెట్టినందుకు పాపం వస్తుందా?

ఎందుకంటే వీరు వీఐపిలు, వీవీఐపిలు మనకుగానీ, దేముడుకి కాదు కదా!



చందమామ మాట:

శ్రమ నీ ఆయుధం ఐతే విజయం నీకు బానిస అవుతుంది!

Sunday, August 30, 2009

నేటిమాట:

మహిళలకు 50% పంచాయతీల్లొ రిజర్వేషన్!

ఇక ముగుళ్ళ(మొగాళ్ళ) హంగామా!

(నిన్న జరిగిన భువనగిరి(నల్గొండ జిల్లా)మండల సమావేశం పేపర్ వార్త చూసిన తరువాత)



చందమామ మాట:

నోరు తెరవకపోతే చేప కూడా చిక్కుల్లో పడదు!

Saturday, August 29, 2009

 నేటివింత:


నేను కొంతకాలం క్రితం రేషంకార్దు కోసం వరుసలో నిలబడ్డాను-గులాబీ కార్డు కోసం!

ఇంతలో ఓ కార్లోనుండి ఓ కుటుంబం దిగింది.

వారూ వరుసలో నిలబడ్డారు - ఐతే తెల్ల కార్డు కోసం!

వారి నెలసరి ఆదాయం నాకంటే సుమారు ఓ పదిరెట్లు! ఓ పాతిక ఎకరాల ఆశామి!



చందమామ మాట:

గెలవాలన్న తపన తగ్గితే ఓటమికి దగ్గరైనట్లే!

Wednesday, August 26, 2009

నేటివింత!

ఇతర మతాల్లోకి కూడా కులాలు, కులరాజకీయాలు చేర్చడం
మన రాజకీయనాయకులకే చెల్లింది.

చందమామ మాట:

ఎవరైనా నిను ఒకసారి మోసం చేస్తె ఆ పాపం వారిదే..
రెండుసార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే!

Tuesday, August 25, 2009

నిబంధన

సుస్వాగతం
నేను ముందేచెప్పినట్లు నా మెదడు అంతా గజిబిజి! మాట్రిక్స్ లా!
ఈరోజు ట్రాఫిక్ పోలీస్ నా వాహనం పొల్ల్యూషన్ సర్టిఫికెట్ నఖ శిఖ పర్యంతం తనిఖీ చేస్తుండగా ప్రక్కనుండి ధట్టమైన పొగతో ఓ లారీ పోతోంది! పోలీస్ ఆపలేదు!
రూలు వారికి లేదా? మరలా మెదడు అంతా గజిబిజి!

Sunday, August 23, 2009

MATRIX MIND

 I am a puzzled person.
My mind is full with several doubts.
e.g. whether God is there in the Universe with powers or not?
If YES Why is this inequality among people?
  Why this poverty?
 Why these starvation deaths?
 What for this terrorism on the name of God?
 How the corruption is growing like any thing?
 Why the money is playing in the hands of a limited people?
 Why these floods, earthquakes like natural calamities and unusual deaths?
If NO There are no reasons for the above.